రమేష్ బిధూరిపై బీజేపీ క్రమశిక్షణ చర్యలు..! 19 h ago
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేష్ బిధూరి పై అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఢిల్లీ సీఎం అతిశి, ప్రియాంక గాంధీపై బిధూరి మాటలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అతిశి మీడియా ముందే కన్నీరు కూడా పెట్టుకుంది. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు చర్చలు జరిగినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.